రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారత్ బంద్.. కేంద్రం హైఅలర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారత్ బంద్.. కేంద్రం హైఅలర్ట్

April 9, 2018

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఈ నెల 2న భారత్ బంద్ నిర్వహించడం తెలిసిందే. బంద్ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయారు. ఈ బంద్ వల్ల తాము నష్టపోయామని అగ్రవర్ణాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో అగ్రవర్ణాలు, రిజర్వేషన్లను వ్యతిరేకించేవార మంగళవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరక్కుండా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. రేపు నిర్వహించబోయే బంద్‌కు ఒక రాజకీయ పార్టీ, కొన్ని మతసంఘాలు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.