Bharat Jodo Yatra: Rohith Vemula's Mother Joins Rahul, Extends Solidarity
mictv telugu

‘బీజేపీ, ఆర్ఎస్ఎస్’ నుంచి ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడండి

November 1, 2022

తెలంగాణలో ఏడవ రోజున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలైంది. మంగళవారం ఉదయం శంషాబాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నేడు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. ఈరోజు యాత్రలో 2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక తల్లి పాల్గొన్నారు. ‘భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఉదయం రాహుల్ గాంధీతో కలిసి ఆమె కొద్దిసేపు నడిచారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న రాధిక వేముల చిత్రాలను పోస్ట్ చేసింది.

రోహిత్ వేములకి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం, దళితులకు, అణగారిన వర్గాలకు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం, అందరికీ విద్య కావాలంటూ అనంతరం రాధిక వేముల ట్వీట్ చేశారు. జనవరి 17, 2016న 26 ఏళ్ల దళిత విద్యార్థి మృతితో ఉన్నత విద్యా సంస్థల్లో కులతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.

రాహుల్ యాత్ర ఈ రోజు ఇలా..

భారత్ జోడో యాత్ర ఈ ఉదయం ఆరాంఘర్ మీదుగా పురాణాపూల్ చేరుకోనుంది. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకోనుంది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు రాహుల్. సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో సమావేశం అనంతరం.. బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో బస చేయనున్నారు రాహుల్.