ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర

October 18, 2022

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నేడు ఏపీలో ప్రవేశించింది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు కర్నూలు జిల్లా ఆలూరు చత్రగుడి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుని.. ఆ తర్వాత ఆలూరు శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి ఏడున్నర గంటలకు పాదయాత్రలో విరామం తీసుకుంటారు. ఈ యాత్ర ఏపీలో అక్టోబర్ 18 నుంచి 21 వరకు నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా కొనసాగుతుంది.

రాహుల్ గాంధీ పాదయాత్ర 18న ఆలూరు మీదుగా మణికుర్తి వరకు.. ఆ తర్వాత 19న చాగి గ్రామం నుంచి ఆదోని మీదుగా ఆరెకల్ వరకు. అలాగే 20న చెన్నాపురం క్రాస్ నుండి ఎమ్మిగనూరు మీదుగా కల్లుదేవకుంట గ్రామం వరకు.. ఇక 21న మంత్రాలయం గుడి సర్కిల్ నుండి మాధవరం బ్రిడ్జి వరకు సాగనుంది. ఏపీలో పాదయాత్ర ముగిసిన తర్వాత 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు దగ్గర తెలంగాణలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ వస్తారు.