భరతమాతకు ఎంతమంది భర్తలు? అని ప్రశ్నించిన క్రైస్తవ బోధకుడి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

భరతమాతకు ఎంతమంది భర్తలు? అని ప్రశ్నించిన క్రైస్తవ బోధకుడి అరెస్ట్

December 12, 2017

భరతమాతను విమర్శించాడనే ఆరోపణలపై ఓ క్రైస్తవ మతబోధకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన యలమంచిలి విజయ్ కుమార్ అలియాస్ బ్రదర్ విజయ్ నాలుగు నెలల కిందట భరతమాతను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. భరతమాతకు ఎంతమంది భర్తలు? మూడుకోట్లా?ఇది అభ్యంతరకరంగా ఉందని హుస్సేనీ ఆలంకు చెందిన వ్యాపారి కునాల్ రావు ఈ నెల 7న కేసు పెట్టారు. భారతీయుడిగా తన మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో క్రైస్ట్ గాస్పెల్ టీం అనే సంస్థను నడుపుతున్న విజయ్‌ని పోలీసులు ధవళేశ్వరంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బ్రదర్  వ్యాఖ్యలు మత సామరస్యాన్ని, మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయిన పోలీసులు నిర్ధారించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తాను భరత్ మాతను కించపరచలేదని, ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమాపణ కోరతానని అన్నారు. తన ప్రసంగంలోని ఒక బిట్‌ను మాత్రమే తీసి ప్రచారం చేశారని అన్నారు.