భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తొలి సమావేశం ఎక్కడన్నదానిపై స్పష్టత వచ్చింది. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలోగాని, మహారాష్ట్రలోని అమరావతిలోగాని జరుగుతుందని వచ్చిన వార్తలు నిజం కాదని తేలింది. తొలి సభ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. జనవరి మొదటి వారంలో నాందేడ్ జిల్లాలో బీఎస్ఆర్ బహిరంగ సభ జరుగుతుందని, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పొరుగు రాష్ట్రంలో పర్యటించిన నేతలు ఈ వివరం వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నాందేడ్ జిల్లాలోని బోకర్, కీని, పాలజ్ పర్యటించి స్థానిక నాయకులను గులాబీగూటికి ఆహ్వానించారు. వందమందికిపై స్థానికులు కూడా పార్టీలో చేశారు. తర్వాత నేతలు మాట్లుడూ.. కేసీఆర్ ఫ్రభుత్వం రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజాసంక్షేమం కోసం పాటుబడుతోందని, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి పథకాలను, బీఆర్ఎస్ పాలనను కోరుతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించిన కేసీఆర్ ఆ ప్రయత్నాలకు స్వస్తిపలికి టీఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా మార్చడం, ఎన్నికల సంఘం ఈ మార్పుకు ఆమోదం పలకడం తెలిసిందే.