భరత్ రెడ్డీ.. నీ భరతం ఖాయం! - MicTv.in - Telugu News
mictv telugu

భరత్ రెడ్డీ.. నీ భరతం ఖాయం!

December 2, 2017

నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో ఇద్దరు దళితులపై అమానుష దాడికి పాల్పడిన బీజేపీ నేత భరత్ రెడ్డి కథ ఇక జైలుకు చేరనుంది. దాడికి మసిపూసి మారేడుకాయ చేయాలని చూసిన అతని పన్నాగాన్ని బాధితులు బట్టబయలు చేయడంతో ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, జైలుకు పంపాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించినందుకు భరత్ రెడ్డిపై, అతని న్యాయవాదులపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని దళిత నేత పామర్రు నవీన్ డిమాండ్ చేశారు. బాధితులు రాజేశ్వర్, లక్ష్మణ్ ‌కు భరత్ రెడ్డి ముఠా నుంచి ప్రాణహాని ఉన్నందున వారికి, వారి కుటుంబాలను పోలీసు భద్రత కల్పించాలని, ఇంత ఘోరంగా అవమానించిందుకు నష్టపరిహారం కూడా చెల్లించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయంలో పోలీసులు జాప్యం చేయకుండా వెంటనే భరత్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారించి ఉంటే బాధితుల ఆచూకీ త్వరగా తేలేదని అంటున్నాయి. బీజేపీ నేతలకు, పోలీసులకు తెలియకుండా 20 రోజులు భరత్ రెడ్డి వారిని హైదరాబాద్‌లో నిర్బంధించడం జరగదని, దీని వెనక ఏ పెద్దల హస్తముందో తేల్చడానికి రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్నందుకు భరత్ రెడ్డి .. ఆ ఇద్దరు యువకులను నీటిలో మునకవేయించి, నేలకు ముక్కు రాయించడం తెలిసిందే.