మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా.. ? అయితే ఛార్జీల మోత తప్పదు - MicTv.in - Telugu News
mictv telugu

మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా.. ? అయితే ఛార్జీల మోత తప్పదు

May 20, 2022

మొదట అన్ని ఫ్రీ గా ఇస్తామని ప్రకటించిన రిలియన్స్ జియోకి పోటీగా.. టెలికం రంగంలోని మిగతా కంపెనీలు కూడా ఛార్జీలు, ప్లాన్‌ల రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. తీరా కస్టమర్లు పెరిగిన తర్వాత జియో సంస్థ క్రమంగా రేట్లు పెంచడం మొదలెట్టింది. అదే బాటలో ఎయిర్‌టెల్‌, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్‌ రేట్లను పెంచేశాయి. అయితే మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్‌టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విత్తల్‌ వెల్లడించారు.

ఈ సారి పెంచే ఛార్జీలతో ప్రతి కస్టమర్ నుంచి ప్రతినెలా సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని ఆయన చెప్పారు. కంపెనీ టార్గెట్ ఆర్పు రూ.300కు చేరడం అయిదేళ్లలో సాకారమవుతుందని ఇన్వెస్టర్‌ కాల్‌లో వివరించారు. 2021 మార్చి క్వార్టర్ లో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరకు రూ.178కి చేరిందని గుర్తు చేశారు. చిప్‌సెట్‌ల కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగినా కూడా, 4జీ సేవల్లోకి అదనపు వినియోగదారులను ఆకర్షించగలగడమే ఇందుకు కారణమని చెప్పారు.