ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం.. ఏకంగా రూ.23వేల కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం.. ఏకంగా రూ.23వేల కోట్లు 

November 14, 2019

మూలిగే నక్కపై తాటిపండు పడింది. జియో నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ.. సుప్రీం కోర్టు తీర్పుతో మరింతగా మసకబారుతోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి ఏకంగా రూ. 23,040 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మొదట్లో రూ. 118 కోట్ల లాభాన్ని చవిచూసిన ఎయిర్‌టెల్ పనితీరు ఈ స్థాయికి దిగజారడం మార్కెట్ వర్గాలను నివ్వెరపరుస్తోంది. 14 ఏళ్లలో వరుసగా రెండు త్రైమాసికాల్లో కంపెనీకి నష్టాలు రావడం ఇదే తొలిసారి.

Bharti Airtel.

రెవెన్యూ బాగానే ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు నిధులు కేటాయించాల్సి రావడంతో నష్టం వాటిల్లింది. స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు, లైసెన్సు ఫీజుల కేసులో టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు ఇటీవల షాకిచ్చింది. అవి ప్రభుత్వానికి రూ. 92 వేల కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఎయిర్‌టెల్ రూ. 21,682 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 16,456 కోట్లు చెల్లించాలి. వీటికి వడ్డీలు, జరిమానాలు అదనం. రూ1999-2000 కొన్ని కంపెనీలు వీలీనాకు వెళ్లాయి. అధికభారం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపై పడింది. ఎయిర్‌టెల్  రూ.42వేలకోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 40 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.