భారతీ ఎంటర్‌ప్రైజెస్ రూ.100 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

భారతీ ఎంటర్‌ప్రైజెస్ రూ.100 కోట్ల విరాళం

March 31, 2020

Bharti Enterprises, Airtel, Infratel announce Rs 100 crore donation to fight Coronavirus

కరోనా వైరస్ ప్రభావం నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించాలని మనసున్న మారాజులు ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. డబ్బున్నవాళ్లే కాకుండా సామాన్యులు కూడా మేము సైతం అంటున్నారు. సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపించి తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. తాజాగా 

భారతీ ఎంటర్‌ప్రైజెస్ పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. తన కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ తదితర కంపెనీలు అన్నింటి భాగస్వామ్యంతో ఈ విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే కొంత మొత్తాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌లో జమ చేసింది. 

మిగిలిన మొత్తంతో వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, వ్యక్తిగత రక్షక వైద్య పరికరాలు, వెంటిలేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలకు వినియోగించనుంది. మంచి మన్నికైన ఎన్ 95 మాస్కులను దాదాపు 10 లక్షల వరకు సేకరించి  అందుబాటులోకి తేనుంది. మ‌రోవైపు భారతీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకోసం సంస్థ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా సేకరించిన విరాళాలు అన్నింటిని కూడా పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్టు సంస్థ తెలిపింది.