భట్టి విక్రమార్కను పార్లమెంటుకు పంపుతా : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

భట్టి విక్రమార్కను పార్లమెంటుకు పంపుతా : కేసీఆర్

March 15, 2022

fbhdf

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. మంగళవారం సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కేంద్రం విషయాలను బాగా ఫాలో అవుతున్నారు. ఢిల్లీ విషయాలను అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రమోషన్ రావాలి. అందుకే భట్టీని పార్లమెంటుకు పంపుదామనుకుంటున్నా. ఇన్నాళ్లకు ఆయనకు మా మీద దయ కలిగింది. మన ఊరు – మన బడి స్కీం బాగుందని కితాబిచ్చినట్టు తెలిసింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అంటూ ముగించారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో దేశంలో 28వ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలియజేశారు. తెచ్చిన అప్పులను ఆస్తుల కల్పనకు వాడుతున్నామని, కఠోర ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్నామని స్పష్టం చేశారు.