Bhavinder married actress Amalapal five years ago
mictv telugu

నాకు అమలాపాల్‌తో ఐదేళ్ల క్రితమే పెళ్లయింది.. సాక్ష్యాలు ఇవిగో

September 8, 2022

Bhavinder married actress Amalapal five years ago

హీరోయిన్ అమలాపాల్‌ తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్‌పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్.. బెయిల్ కోసం భవీందర్ దరఖాస్తు చేసుకోగా అందులో సంచలన విషయాలు వెల్లడించాడు.

2017లోనే అమలాపాల్‌తో తనకు పెళ్ళయిందని చెప్తూ అందుకు తగ్గ సాక్ష్యాలను కోర్టు ముందుంచాడు. పరిశీలించిన కోర్టు భవీందర్‌కి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు అమలాపాల్ 2014లో దర్శడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత విభేదాలతో ఈ జంట 2017లో విడిపోయింది. తర్వాత అమలాపాల్ పుదుచ్చేరికి వెళ్లిపోగా, అక్కడ సింగర్ భవీందర్‌తో ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని కొట్టేస్తూ అతను సినిమా నిర్మాణంలో సహ భాగస్వామి మాత్రమేనని స్పష్టం చేసింది. తర్వాత వీరి పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో అది ఫోటో షూట్ మాత్రమేనని చెప్పింది. కానీ, ఇప్పుడు భవీందర్ తమకు పెళ్లి జరిగిందని బెయిల్ పిటిషన్‌లో పేర్కొనడం, సాక్ష్యాలు సమర్పించి బెయిల్ పొందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.