12 ఏళ్ల చిన్నోడు.. కోట్ల ఆస్తి వద్దని సన్యాసం.. - MicTv.in - Telugu News
mictv telugu

12 ఏళ్ల చిన్నోడు.. కోట్ల ఆస్తి వద్దని సన్యాసం..

April 19, 2018

జీవితం చిత్రమైనది. ఒకపక్క రేపోమాపో పోతారని అనుకునే ముసలాళ్లు ఎన్నెన్నో కోరికలు కోరుతుంటారు. అది తినాలని ఉందని, ఇది కావాలని అంటుంటారు. మరోపక్క ముక్కపచ్చలారని పిల్లలు ఇహంపై విరక్తితో పరాన్ని ఆశ్రయించి.. అంతా మిథ్య అంటుంటారు. గుజరాత్‌లో ఒక 12ఏళ్ల బాలుడు.. కోట్ల ఆస్తులు, విలాసాలను పూచికపుల్లల్లా భావించి సన్యాసం తీసుకున్నాడు.

సూరత్‌కు వజ్రాల వ్యాపారి దీపేశ్ షా కుమారుడు భవ్య షా గురువారం జైన సంప్రదాయం ప్రకారం సన్యాసం పుచ్చుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దేవుడి నిర్దేశించిన సత్యమార్గంలో పయనించడం తనకు చాలా గర్వంగా ఉందని భవ్య షా అన్నాడు. తన తల్లిదండ్రులు కూడా తన బాటలో నడుస్తారని చెప్పాడు. తండ్రి దీపేష్ స్పందిస్తూ.. ‘ మా బిడ్డ మమ్మల్ని వదలి వెళ్తున్నాడని మాకేం బాధగా లేదు. మా కుటుంబంలో సన్యాసాలు కొత్తకాదు. మా కుమార్తె నాలుగేళ్ల కింద 12 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారింది..’ అని అన్నారు. ధనిక జైన కుటుంబాల్లో సన్యాసం తీసుకోవడం ఇటీవల పెరిగింది.