భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిగాయి. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు దుండగులు ఈ సంఘటనకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఇది జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యూపీలోని బులాంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్తుండటంతో దాడికి దిగారని పేర్కొన్నారు.
దీనిపై పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ స్పందించారు. దాడి జరిగిందని నిర్ధారణ కాలేదని తెలిపారు. దీనిపై వివరాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. బులాంద్‌షహర్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత వీరేంద్ర సిరోహి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు వస్తున్న ఆధరణ తట్టుకోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆజాద్ సమాజ్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి దాడులతో వాతావరణాన్ని చెడగొట్టాలేరన్నారు. కాగా, ఏఎస్పీ తరఫున హాజీ యామిన్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.