భీమ్లా నాయక్ విడుదల వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

భీమ్లా నాయక్ విడుదల వాయిదా

December 21, 2021

05

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కలయికలో వచ్చిన సినిమాలు ఎంతంటి విజయాన్ని సాధించావో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరొకసారి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న భీమ్లా నాయక్ చిత్రం కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

తెలుగు నిర్మాతల గిల్డ్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా విడుదల చేసుకున్న మార్పులను వివరించారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్‌ ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. శివరాత్రికి పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ చిత్రం విడుదల కానుందన్నారు. దీంతో భీమ్లా నాయక్‌ నిర్మాత చినబాబు, పవన్‌ కల్యాణ్‌కు నిర్మాతల గిల్డ్‌ కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని నిర్మాత దిల్‌ రాజు అభిమానులకు సూచించారు. సంక్రాంతి బరిలో రాధే శ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాత దిల్‌ రాజు థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి భీమ్లానాయక్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేసేలా నిర్మాతలను ఒప్పించినట్లు సమాచారం.