‘భీష్మ’ చిత్రం.. కేటీఆర్‌కు దర్శకుడి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

‘భీష్మ’ చిత్రం.. కేటీఆర్‌కు దర్శకుడి ఫిర్యాదు

February 27, 2020

Bheeshma.

నితిన్ తాజాగా నటించి విజయవంతంగా ప్రదర్శింపడుతున్న ‘భీష్మ’ చిత్రానికి పైరసీ కష్టం వచ్చి పడింది. ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన తెలంగాణ ఆర్టీసీ సంస్థలోనే భీష్మ చిత్రం పైరసీ ప్రత్యక్షం అవడం చిత్ర యూనిట్‌ను తీవ్ర కలవరానికి గురిచేసింది. భీష్మ చిత్ర పైరసీని ఓ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ప్రసారం చేశారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ దృష్టికి తీసుకెళ్లాడు. అది చూసిన చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల షాక్‌కి గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని వెంకీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. మాకు ఏ కష్టం వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే ఐడి కేటీఆర్ గారిది అని వెంకీ ట్వీట్ చేశాడు.

వెంకీ ట్వీట్ చేసిన కొంత సమయానికే తెలంగాణ పోలీసులు స్పందించారు. బస్సు వివరాలు అడిగి తెలుసుకుని చర్యలు మొదలు పెట్టారు. ఇలాంటి పైరసీలు ఎక్కడ కనిపించినా తమ దృష్టికి తీసుకురావాలని వెంకీ కుడుముల నితిన్ అభిమానులు కోరాడు. కాగా, గత వారం భీష్మ చిత్రం విడుదల అయిన సంగతి తెలిసిందే. నితిన్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.