‘భీష్మ’ మేకింగ్‌‌లో రష్మిక అల్లరి చూడండి..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

‘భీష్మ’ మేకింగ్‌‌లో రష్మిక అల్లరి చూడండి..(వీడియో)

February 20, 2020

నితిన్, రష్మికలు హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘భీష్మ’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఈ నెల 21న ‘భీష్మ’ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది. సెట్స్‌లో రష్మిక చేసే అల్లరి, నితిన్‌ కామెడీ పంచ్‌లతో మేకింగ్‌ వీడియో నవ్వులు పూయిస్తోంది. ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే… ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్‌ వీడియోను రూపొందించారు. దర్శకుడి షర్ట్‌పై ‘హీ ఇజ్‌ ఏ వెరీ రోమాంటిక్‌ ఫెల్లో’ అని రష్మీక రాసింది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.