'భీమ్లా నాయ‌క్' సినిమా హాళ్ల వ‌ద్ద రచ్చ రచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

‘భీమ్లా నాయ‌క్’ సినిమా హాళ్ల వ‌ద్ద రచ్చ రచ్చ

February 25, 2022

 pavannnnnn

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథనాయకుడిగా, రానా దగ్గుబాటి ప్రతినాయకుడిగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సినిమా ‘భీమ్లానాయక్‌’. ఈ సినిమాను వీక్షించేందుకు ఉదయం నుంచి అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంతమంది సినిమా వీక్షించిన అనంతరం ఆనందంతో డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట‌పాసులు పేల్చుతూ హోరెత్తిస్తున్నారు. మరికొంత మంది అభిమానులు భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌వుతోన్న సినిమా హాళ్ల వ‌ద్ద గురువారం రాత్రి నుంచే ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఆటోలతో రివ్వు రివ్వు మంటూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి.

p1