రేపే 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వేడుక - MicTv.in - Telugu News
mictv telugu

రేపే ‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ వేడుక

February 22, 2022

04

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు కలిసి నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అయితే, ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 21న జరగాల్సి ఉండగా ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు నిరాశపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రీ రిలీజ్ వేడు‌క‌కు సంబంధించి, కొత్త తేదీని ప్ర‌క‌టించింది.

రేపు (ఫిబ్రవరి 23) సాయంత్రం 6.30 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేపు జరగనున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం.