‘ భీమ్లానాయక్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘ భీమ్లానాయక్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

March 18, 2022

PAVANJ

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లానాయక్. మలయాళ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రం గత నెల 25న థియేటర్లలో విడుదలై దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడీ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 25న ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఓటీటీ వారు ప్రకటించారు. అదేరోజు రాజమౌళి భారీ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలో రిలీజవుతుండడం గమనార్హం.