భీవండి భవనం కింద శవాల కుప్ప.. 33కు చేరిన మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

భీవండి భవనం కింద శవాల కుప్ప.. 33కు చేరిన మరణాలు 

September 23, 2020

bbngvn

భీవండిలో ఇటీవల కుప్పకూలిన భవనం కింద శవాలు వెలికి తీస్తూనే ఉన్నారు. శిథిలాల కింద చనిపోయిన వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 33 శవాలను బయటకు తీశారు. ఇంకా అధికారులు బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. దీని కోసం ప్రత్యేకించి క్యానిన్ స్క్వాడ్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై భవనం యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

థానే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 43 ఏళ్ల క్రితం ఓ భవాన్ని నిర్మించారు. పవర్‌ లూం కార్మికులు నివసిస్తుంటారు. దాదాపు 40 ఫ్లాట్లలో 150 మంది వరకు ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున 3.40 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టి కొంత మందిని సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. అంతా నిద్రపోతున్న సమయంలో ఇది జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కాగా ఈ భవనం శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల జాబితాలో లేకపోయిన ఎలా కూలిపోయిందనేది తేలాల్సి ఉంది.