Bhogapuram Airport line clear
mictv telugu

ఏపీలో మరో ఎయిర్ పోర్ట్‌కు లైన్ క్లియర్

November 4, 2022

విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్ట్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. దీనితో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. వారిలో పలువురు కేసులు ఉపసంహరించుకున్నారు.

ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించగా..మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎయిర్ పోర్ట్‌ను నిర్మించేందుకు ఏపీ సర్కార్ జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.