నివేదికలతో భోగిమంటలు.. ఇది నిరసనల సంక్రాంతి..  - MicTv.in - Telugu News
mictv telugu

నివేదికలతో భోగిమంటలు.. ఇది నిరసనల సంక్రాంతి.. 

January 14, 2020

jkgjnhnc

ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం కాస్తా సంక్రాంతి నిరసనగా మారిపోయింది. ఈ రోజు అమరావతి ప్రాంతంలో నినాదాలతో పండగ మొదలైంది. రాజధాని ఏర్పాటుపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, జీఎన్ రావు కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రతులతో ఆందోళనకారులు పొద్దుపొద్దున్నే భోగిమంటలు వేసుకున్నారు. అమరావతి జేఏసీ పిలుపుతో పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వాటిని కాల్చేశారు. తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్దా బోగీమంటలు వేసుకున్నారు. కొన్ని చోట్ల తాము పండగ చేసుకోబోమని రైతులు తెగేసి చెప్పారు. 

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జరిగిన నిరసనలో ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఇంత భారీగా వ్యతిరేకత వస్తున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమరావతి  గ్రామాలు ‘ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే’ అనే నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.