సినిమా హీరో, హీరోయిన్లంటే మనదేశంలో ఉండే క్రేజే వేరు. అందులో అభిమాన హీరోయిన్ రోడ్డు మీదకు వస్తే ఊరుకుంటారా? ఎలాగైనా ఒక్క ఫోటో తీసుకుందామని ప్రతీ ఒక్క యువత ఆరాటపడతారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. తాజాగా ఇలాంటి ఘటన భోజ్ పురి హీరోయిన్ అక్షర్ సింగ్ కి ఎదురైంది. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో హడలిపోయిన అక్షర.. వారి నుంచి తప్పించుకొని చెప్పులను కూడా వదిలేసి స్కూటీ ఎక్కి పారిపోయింది. అంతకుముందు బీహార్ లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చింది అక్షర.
जब निकले नी घर से बहरिया
चाहें सभे लड़ावल नजरिया 🙈चप्पलवो नहीं पहनने देते ई फैन लोग 😭 #aksharasingh 😂❤️ pic.twitter.com/2j81Viv1kn
— 🖤 (@chi_kkii) December 26, 2022
హీరోయిన్ తమ ప్రాంతంలో కనిపించడంతో జనం ఆగలేక ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మొదట్లో నవ్వుతూ ఫోటో దిగిన హీరోయిన్.. వందల మంది ఎగబడడంతో కాళ్లకు పని చెప్పింది. చెప్పులు వేసుకున్నానా? లేదా? అని చూడకుండా ఓ వ్యక్తి స్కూటీ ఎక్కి పలాయనం చిత్తగించింది. అయినా వదలని అభిమానులు ఆమె స్కూటీ వెనుక పరిగెత్తారు. వీడియో చూస్తే ఆమెను తరుముతున్నట్టుగా ఉంటుంది కానీ అసలు జరిగింది ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉత్తరాదిన వైరల్ గా మారింది. నెటిజన్లు లైక్ చేస్తూనే హీరోయిన్ కి ఎంత కష్టం వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.