ఇంటికి పిలిచి, సైజు ఎంతంటూ వేధింపులు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ‘మీటూ’ వేధింపులు నిందితుడు సాజిద్ ఖాన్‌కు ఇప్పట్లో ఇబ్బందులు ముగిసేలా కనిపిస్తలేవు. మందన, కనిష్క సోని, కరిమి, ఆహానా కుమ్రా, షెర్లిన్ చోప్రా వంటి అనేక బాలీవుడ్ హీరోయిన్స్ సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దాంతో ఇండస్ట్రీ నుండి రెండు సంవత్సరాలు బహిష్కరణకు కూడా గురయ్యాడు సాజిద్ ఖాన్. అయితే ఇప్పుడు వీరి తరువాత మరో హీరోయిన్ రాణి ఛటర్జీ సాజిద్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కాస్టింగ్ కౌచ్ కష్టాలను బిగ్ బాస్ 16 కంటెస్టెంట్‌తో పంచుకుంది ఈ బ్యూటీ. భోజ్‌పురి పరిశ్రమలో రాణికి మంచి క్రేజ్ ఉంది. ససుర బడా పైసావాలా, దేవ్రా బడా సతవేలా వంటి అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో నటించిన రాణి ఛటర్జీ హిమ్మత్‌వాలా చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
మిల్కి బ్యూటీ తమన్నా నటించిన హిమ్మత్ వాలా సినిమాలో ఒక ఐటం సాంగ్ ఇంటర్వ్యూ కోసం తనని ఇంటికి పిలిచి వేధించాడని చెప్పింది రాణి ఛటర్జీ. ఒంటరిగా ఆయన ఇంటికి వెళ్ళాకా తన బ్రెస్ట్ సైజ్ అండ్ బాడీ కొలతలు గురించి సాజిద్ అడిగాడని, తనని తాకరాని చోట తాకుతూ తనని నలిపేశాడని, అతను ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కావడంతో ఆ టైమ్‌లో ఏం చేయలేక నిశ్చేష్టురాలిని అయ్యానని రాణీ ఛటర్జీ తెలిపింది. ఇక నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని.. తనతో రోజు ఇంటర్‌కోర్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడాడని చెప్పింది. ఏది ఏమైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ వివాదం మరోసారి తెరపైకి రావడం, అక్కడి సినీ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుండడంతో ప్రస్తుతం హిందీ బిగ్ బాస్‌లో ఉన్న సాజిద్ ఖాన్‌ను బయటికి పంపాలని డిమాండ్స్ వస్తున్నాయి.