బస్టాండ్‌లో పోర్న్ వీడియో.. కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

బస్టాండ్‌లో పోర్న్ వీడియో.. కేసు నమోదు

November 23, 2019

Bhopal bus stand .

పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది. ప్రయాణికులు సిగ్గుతో తలదించుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పడేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని విద్యానగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

గత నెల 28న అక్కడి బస్టాండులో ఏర్పాటు చేసిన టికెట్ వెండింగ్ మిషన్ స్క్రీన్‌పై రెండు పోర్న్ వీడియోలు దర్శనమిచ్చాయి. దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగర మునిసిపాలిటీ దీనిపై కేసు నమోదు చేసింది. మిషన్‌లోకి ఆ వీడియోలోను అప్‌లోడ్ చేసింది ఎవరో తేల్చాలని పోలీసులను కోరింది.