అహంకారమా.. అతి తెలివా.. లేకపోతే విలువలు మరిచారా ? - MicTv.in - Telugu News
mictv telugu

అహంకారమా.. అతి తెలివా.. లేకపోతే విలువలు మరిచారా ?

August 9, 2017

స్టాంపులు సామాన్యంగా అయితే ఎక్కడేస్తరూ ? ఏ పోస్టల్ కవర్ పైన్నో, సీజ్ చేసినప్పుడు తాళాల పైన్నో వేస్తారు. కానీ భోపాల్ సెంట్రల్ జైలు అధికారులు మాత్రం మరీ విచిత్రంగా అభం శుభం తెలియని పసి పిల్లల ముఖాల మీద స్టాంపులు వేసి ఆశ్యర్యంలో ముంచెత్తారు. ఇంతకీ ఆ పిల్లలు చేసిన పాపమేంటోనని ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం చెయ్యలేదూ.. రక్షా బంధన్ సందర్భంగా జైల్లో వున్న వాళ్ళ బంధువులకు రాఖీ కడదామని వెళ్ళారట ఈ పిల్లలు. అయితే ఏంటీ ఆ మాత్రానికే జైలు సిబ్బంది ఇలా ముఖాల మీద స్టాంపులేసి అవమానించడం అవసరమా.. అంటారు కదూ. కానీ ఇక్కడొక చిక్కొచ్చి పడిందేమిటంటే రక్షా బంధన్ రోజు ఏకంగా 8,500 మంది మహిళలు, పిల్లలు జైలు ప్రాంగణంలోకి వచ్చారట.

అందుకనీ జైలు సిబ్బందికి తల పట్టుకునే పరిస్థితి ఏర్పడిందట. లోపలికి ఎంట్రీ అయ్యేవాళ్ళ ముఖాల మీద ఇలా స్టాంపులేసి పంపారట. ముఖం మీద స్టాంపు వున్న వాళ్ళు ఎంట్రీ పర్మిషన్ తీస్కొని వచ్చారని లోపలున్న సిబ్బంది నిర్ధారణ అవడానికన్నట్టు. మరీ విచిత్రంగా వుంది కదూ జైలు వారి వింత ఆలోచన. ఈ విషయం తెల్సిన చాలా మంది జైలువారిది అహంకారమా.. అతి తెలివా.. లేకపోతే విలువలు మరిచారా ? అని అనుకుంటున్నారట.కానీ వాళ్ళ విధులు వాళ్లు కరెక్టుగా నిర్వహించాలంటే తప్పదు. చూసేవారికి తప్పుగా అన్పించినా అది జైలు, అందులో వున్నది ఖైదీలు. కాబట్టి వారి డ్యూటీ వాళ్ళు కరెక్టుగా చేసినట్టే లెక్ఖ.