ఎయిర్‌పోర్ట్‌లో పిచ్చోడి వీరంగం.. హెలికాప్టర్ ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌పోర్ట్‌లో పిచ్చోడి వీరంగం.. హెలికాప్టర్ ధ్వంసం

February 3, 2020

pichoddd

భోపాల్ విమానాశ్రయంలో ఓ యువకుడు వీరంగం సృష్టించారు. రాజ భోజ్ ఎయిర్ పోర్టులో ఉన్న హెలిప్యాడ్ వద్దకు వెళ్లి అక్కడ నిలిపిన హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. ఆ పక్కన బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్ జెట్ విమానం ముందు నిలబడి ప్రయాణానికి ఆటంకం కలిగించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. 

fvgb

అధికారుల కళ్లుకప్పి ఎయిర్ పోర్టులోకి చొరబడినఈ యువకుడు కొంత సేపు హంగామా సృష్టించాడు. దీంతో స్పైస్ జెంట్ విమానం గంట ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. అతడు రన్‌వేపైకి వచ్చిన సమయంలో విమానంలో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి అపాయం తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ దాడి ఘటనలో హెలికాప్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.ఇతడు భోపాల్‌కు చెందిన యోగేశ్ త్రిపాఠిగా గుర్తించారు. అతడికి మతిస్థితిమితం సరిగాలేకపోవడంతో ఇలా ప్రవర్తించాడని అధికారులు వెల్లడించారు.   

fv