bhopal police molested women on roads at mid night
mictv telugu

అర్థరాత్రి నడిరోడ్డులో యువతిపై పోలీస్ దారుణం

March 9, 2023

bhopal police molested women on roads at mid night

మధ్యప్రదేశ్‏లో దారణం చోటు చేసుకుంది. మహిళలను మానవ మృగాల నుంచి రక్షించాల్సిన పోలీసే వికృత చేష్టలతో వికారాన్ని తెప్పించాడు. డ్యూటీలో ఉండగానే పోలీసు డ్రెస్ వేసుకుని అత్యంత నీచంగా బిహేవ్ చేశాడు. మందు కొట్టడమే కాదు రోడ్డుపైన వెళ్తున్న యువతి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇదంతా గమనించిన కొంత మంది యువకులు యువతిని కాపాడాల్సింది పోయి వీడియోలు తీస్తూ చోద్యాన్ని చూశారు. సోషల్ మీడియాలో ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. యువతి నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి సదరు పోలీసు లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసి షాక్ ఇచ్చారు.

భోపాల్‏కు చెందిన పోలీసు కానిస్టేబుల్ పుష్పేంద్ర జాడోన్ డ్యూటీలో ఉండగానే ఫుల్లుగా మందు కొట్టాడు. హనుమాన్‏గంజత్ ప్రాంతంలో సుమారు 11 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తుండగా మార్గమధ్యలో అటుగా వస్తున్న యువతిని గమనించి ఆమెను అడ్డుకుని లైంగికంగా వేధించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‏ను తాకుతూ పైశాచికంగా బిహేవ్ చేశాడు. అసభ్యకరమైన పదజాలంతో అమ్మాయిని దూషించాడు. పోలీసు కావడంతో పాపం ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. అయినా మత్తులో ఉన్న పుష్పేంద్ర ఆమెను వదల్లేదు. దీంతో బాలిక ఎలాగో అలాగా అతడి చెర నుంచి బయటపడి తప్పించుకుంది. ఇదిలా ఉంటే రోడ్డుపైన ఇంత జరుగుతుంటే వెళ్లి అమ్మాయిని కాపాడాల్సింది పోయి వీడియోలు తీస్తూ చోద్యం చూశారు కొంత మంది వ్యక్తులు. సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం సదరు యువతి కానిస్టుబుల్‏పై కంప్లైట్ ఇచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు సీరియస్ అయిన పోలీసులు పుష్పేందర్‏ను స్పెండ్ చేశారు.

అయితే ఇదే సంఘటనపై కానిస్టేబుల్ పుష్పేంద్ర జాడోన్ వాదన మరోలా ఉంది. ఆమె నా స్నేహితురాలని, మద్యం తాగి ఉందని, బండి మీద దింపుతానంటే ఒప్పుకోలేదని కాకమ్మ కబుర్లు చెబుతూ వచ్చాడు. ఎంత ఫ్రెండైనా రోడ్డుమీద ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణం.