ఫుడ్ బాగోలేదని హోటల్ సిబ్బంది కస్టమర్ల మధ్య ఘర్షణ - MicTv.in - Telugu News
mictv telugu

ఫుడ్ బాగోలేదని హోటల్ సిబ్బంది కస్టమర్ల మధ్య ఘర్షణ

October 30, 2019

ఫుడ్ బాగోలేదని ఓ హోటల్‌లో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. కస్టమర్లు, హోటల్ సిబ్బందికి మధ్య పెద్ద గొడవకు కారణం అయింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో చాలా సేపు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకున్నారు. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ భోజనం ఆర్డర్ చేయగా సిబ్బంది తొందరగా తీసుకురాలేదు. దీంతో వారి తీరుపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత తెచ్చిన ఆహారంలో కూడా నాణ్యత లోపించింది. దీంతో సిబ్బందిని కస్టమర్లు నిలదీశారు. ఆ వెంటనే మిగిలిన వారు కూడా అతనితో కలిసి వారిని ప్రశ్నించారు. అంతా కలిసి కిచెన్ రూంలోకి వెళ్లి వారితో గొడవపెట్టుకున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి కస్టమర్లకు మధ్య మాటామాట పెరిగి దాడిచేసుకునే స్థాయికి చేరింది. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ కూడా సరైన ఆహారం ఇవ్వకపోగా తమపైనే దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు.