Bhumana Karunakar Reddy as TTD Chairman..?
mictv telugu

సీఎం జగన్ కీలక నిర్ణయం..టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి..?

December 28, 2022

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ సర్కార్ పావులు కదుపుతోంది. ఎన్నికలకు ఇప్పటినుంచే నాయకులను సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారు. 175 సీట్లను గెలిచేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీటీడీ పాలక మండలిలో మార్పులు చేయనున్నారని సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‎గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని.. సంక్రాంతి తర్వాత ఈ మార్పులు చేయనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం టీటీడీ చైర్మన్‎గా బాధ్యతలు వహిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అతనికి కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను కట్టబెడతారని తెలుస్తోంది. 2019 నుంచి జూన్ 22న మెదటిసారి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‎గా బాధ్యతలు స్వీకరించారు. 2021 జూన్ 22న ఆయన పదవీ కాలం ముగియగా మరోసారి ఆయననే సీఎం జగన్ కొనసాగించారు. ఇప్పుడు టీటీడీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టిసారించాలని సూచించినట్టు తెలుస్తోంది. అతని స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. భూమనకు కూడా గతంలో టీటీడీ చైర్మన్‎గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఈ పదవిలో కొనసాగారు.