Home > Featured > ‘ఒక్కడు’ స్పెషల్ షో.. థియేటర్‌లో భూమిక సందడి

‘ఒక్కడు’ స్పెషల్ షో.. థియేటర్‌లో భూమిక సందడి

ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మైల్ స్టోన్‌లుగా నిలిచి పోయిన సినిమాల్లో ఒక్కడు, పోకిరి సినిమాలను స్పెషల్ షోలు వేశారు. వీటికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ రావడంతోపాటు ఈ రెండు షోలు హౌస్ ఫుల్ గా రన్ అయ్యాయి.

అయితే ఒక్కడు సినిమా స్పెషల్ షోలో మరొక హ్యాపీ మూమెంట్ కూడా చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో వేసిన ఈ సినిమా స్పెషల్ షో లో ఫ్యాన్స్ తో పాటు ఒక్కడు చిత్ర యూనిట్ కూడా సందడి చేసింది. సినిమాను చూసేందుకు దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కూడా థియటర్ కు వచ్చారు. అభిమానులతో కలిసి ఒక్కడు సినిమాను ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక 2003వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఒక్కడు సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. మహేష్ నటన, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మహేష్ కెరీర్ లోనే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ఎం ఎస్ రాజు నిర్మించారు.

Updated : 10 Aug 2022 12:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top