బాలీవుడ్‌లో విషాదం.. విక్కీడోనర్ నటుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో విషాదం.. విక్కీడోనర్ నటుడు మృతి

September 23, 2020

Bhupesh Kumar Pandya Passes Away After Battling Cancer, Manoj Bajpayee Offers Condolences.

వినూత్న కథాంశంతో బాలీవుడ్‌లో వచ్చిన ‘విక్కీ డోనర్‌’ సినిమా నటుడు భూపేష్‌ కుమార్‌ పాండ్యా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతిచెందారు. ఈ మేరకు నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా పాండ్యా మరణాన్ని ద్రువీకరిస్తూ ట్విటర్‌లో వెల్లడించింది. తన భర్త స్టేజి 4 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని పాండ్యా భార్య ఛాయ ఇటీవల మీడియాకు చెప్పారు. అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు. భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. 

అయితే క్యాన్సర్‌ చికిత్స ఖర్చులతో పాండ్యా కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది. దీంతో ఆ కుంటుంబాన్ని ఆదుకునేందుకు పాండ్యా స్నేహితుడు ఒకరు నిధులు సమీకరించసాగారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి సైతం పాండ్యాకు ఆర్థికసాయం చేశారు. అలాగే నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. ఇంతలో భూపేశ్ మృతిచెందడంపై మనోజ్‌ బాజ్‌పేయి, గజ్‌రాజ్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.