కర్ణాటకలో పాఠశాలలో రాజుకున్న ‘బైబిల్’ వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో పాఠశాలలో రాజుకున్న ‘బైబిల్’ వివాదం

April 25, 2022

కర్ణాటక రాష్ట్రం వరుస మత వివాదాలకు నెలవుగా మారుతోంది. ఇటీవలే హిజాబ్ వివాదం మొదలవగా ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజాగా బైబిల్ వివాదం చెలరేగింది. తమ పిల్లలు పాఠశాలకు బైబిల్ తీసుకెళ్లడాన్ని అభ్యంతరం పెట్టబోము అంటూ పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటోంది. దీనిపై హిందూ సంఘాలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. బెంగళూరులోని క్లియరెన్స్ హైస్కూలు చేసిన ఈ చర్య ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ విషయం బయటికి తెలియడంతో హిందూ జన జాగృతి సంస్థ అధికార ప్రతినిధి మోహన్ గౌడ మాట్లాడుతూ.. క్రైస్తవేతర విద్యార్ధుల చేత స్కూలు యాజమాన్యం బలవంతంగా బైబిల్ చదివిస్తోందని విమర్శించారు. అయితే ఈ చర్యను పాఠశాల యాజమాన్యం సమర్ధించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యను అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. అందుకే తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ పత్రంలో డిక్లరేషన్ తీసుకుంటున్నట్టు వెల్లడించింది.