బిచ్చగాడి పెద్ద మనసు.. వాళ్లను హోటల్ తీసుకెళ్లి వడ్డించి..
సినిమా హీరోల్లో కొందరు నిజ జీవితంలో మాత్రం జీరోలు. కొందరైతే విలన్లుగానూ ప్రవర్తిస్తుంటారు. కొందరు సినిమాల్లో ఎలా కనిపిస్తారో నిజ జీవితంలోనూ అలాగే మసలుకుంటూ రియల్ హీరోలు అనిపించుకుంటారు. లారెన్స్ రాఘవ, మహేశ్ బాబు వంటి వాళ్లు ఆపదలో ఉన్నవాళ్లను అక్కున చేర్చుకుంటారు. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కూడా అలాంటి మంచి మనిషే. తన తాజా మూవీ ‘బిచ్చగాడు 2’ విజయవంతం కావడంతో ఆయన సందడి చేస్తున్నాడు. ఏదో కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం పెట్టి, వీఐపీలను పిలిచి ప్రశంసలు పొందడం వంటివి కాకుండా రియల్ హీరోగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సక్సెస్ యాత్రలో భాగంగా రాజమండ్రిలో ఆయన కొంతమంది యాచకులను మంచి రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కమ్మని భోజనం పెట్టించాడు. తనే స్వయంగా వడ్డించాడు కూడా. బిర్యానీతోపాటు ఎన్నో రుచికరమైన వంటను, ఐస్ క్రీమ్, శీతల పానీయాలను కూడా అందించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీ ప్రజలు బిచ్చగా 2ను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని, బిచ్చాగాడు 3ని కూడా తీస్తాని చెప్పాడు. విజయోత్సవ యాత్రంలో భాగంగా అంతకుముందు తిరుపతిలో యాచకులకు ఆయన దుప్పటి, చెప్పులు, సబ్బు వంటి వస్తువులతో కూడి కిట్లను అందించాడు. బిచ్చగాడు 1 మాదిరే, బిచ్చగాడు 2కు కూడా విజయే దర్శకత్వం వహించి నటిచాడు.