bichagadu hero vijay antony health updates
mictv telugu

విషమంగా బిచ్చగాడు హీరో ఆరోగ్యం.. ఆసుపత్రి బెడ్ నుండి తాజా సందేశం..!

January 24, 2023

bichagadu hero vijay antony health updates

జనవరి 19న మలేషియాలో భిక్షుక 2 (బిచ్చగాడు2) షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు హీరో విజయ్ ఆంటోనీ. అయితే అప్పటి నుండి విజయ్ ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్‌ని చెన్నై తీసుకొచ్చామని భార్య ఫాతిమా మొదటి రోజే తెలిపారు. అయితే రెండు రోజుల తరువాత విజయ్ ఆంటోనీ అపస్మారక స్థితిలో ఉన్నాడని పలు వార్తల పత్రికలు తెలిపాయి. ఈ ప్రమాదంలో విజయ్ ఆంటోనీ దంతాలు, దవడ ఎముకలు విరిగిపోనట్లు సమాచారం. విజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 

అయితే అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. తాజాగా విజయ్ ఆంటోనీ క్షేమంగానే ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారని తెలిసిన విజయ్ ఆంటోనీ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా ట్వీట్ చేశారు. ప్రమాదంలో తన ముక్కు, దవడ తీవ్రంగా గాయపడ్డాయని.. ఇటీవలే వాటికి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్టు విజయ్ గతంలో ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు.