కరోనాతో బీదర్ ఎమ్మెల్యే కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో బీదర్ ఎమ్మెల్యే కన్నుమూత

September 25, 2020

b, nb

కరోనా కాటుకు వరుసగా ప్రముఖులు బలి అవుతూనే ఉన్నారు. వైరస్ వ్యాప్తి పెరగడంతో ఇప్పటికే పలువురు, రాజకీయ ఇతర ప్రముఖులు కన్నుమూశారు. ఇటీవలే ఏకంగా  కేంద్ర మంత్రి ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బీదర్ ఎమ్మెల్యే  బి నారాయణరావు (77) చనిపోయారు.  బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి తుది శ్వాసవిడిచారు. ఈ సంఘటన నియోజకవర్గంలో విషాదం నింపింది.  

నారాయణరావు ఈ నెల 1వ తేదీన అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడే ఆయనకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. మణిపాల్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈయన బీదర్‌ నియోజకవర్గం నుంచి కర్నాటక విధానసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఇదే రాష్ట్రాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కూ మరణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.