Biden canceled the green card rules put by Trump
mictv telugu

గ్రీన్ కార్టులపై గుడ్ న్యూస్.. అన్ని రూల్స్‌ని రద్దు చేసిన బైడెన్

September 10, 2022

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గెలిచిన తర్వాత నుంచి వలసదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అల్పాదాయ వర్గాలపై ట్రంప్ సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రద్దు చేసి ఆదాయం, సబ్సీడీతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్ కార్డు పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వయసు, ఆరోగ్యం, చేసేపనులతో సంబంధం లేకుండా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన నిబంధనలు డిసెంబర్ 23 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ ఆంక్షల తొలగింపు బైడెన్ ఎన్నికల హామీగా చెప్తున్నారు. ట్రంప్ పెట్టిన ఆంక్షలు వలస భారతీయులకు వ్యతిరేకంగా ఉండడంతో చాలా మంది అమెరికాలో నివసించే గ్రీన్ కార్డు రాని ఎన్నారైలు బైడెన్‌కి మద్ధతుగా నిలిచారు. ప్రధాని మోదీ స్వయంగా అమెరికా వెళ్లి ట్రంప్‌కు మద్ధతు తెలిపినా గెలవకపోవడం వెనుక ఈ విషయం ఉందని చాలా మంది అభిప్రాయం. తాజా నిర్ణయం వల్ల భారతీయులకే కాక, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి కూడా భారీ ఊరట లభించినట్టయింది. కాగా, ట్రంప్ హయాంలో ఎవరైనా గ్రీన్ కార్డు పొందాలంటే వారికి ఫుడ్ కార్డు, ఆదాయం, వయసు, ఆరోగ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకునేది. ఎన్నారైల వల్ల ప్రభుత్వానికి భారం పడకూడదనే ఉద్దేశంతో అలా చేసినట్టు ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్దించుకున్నారు.