పీఎఫ్ ఖతాదారులకు శుభవార్త.. 3 నెలలు  కేంద్రమే చెల్లిస్తుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

పీఎఫ్ ఖతాదారులకు శుభవార్త.. 3 నెలలు  కేంద్రమే చెల్లిస్తుంది..

March 26, 2020

Big announcement for EPFO subscribers

కరోనాతో సర్వం అల్లకల్లోలంగా మారింది. లాక్‌డౌన్‌తో ఎలా బతకాలనే ప్రశ్న కలుగుతోంది అందరిలో.  ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు బియ్యం, సరుకులు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ ఖాతాదారులకు యాజమాన్యాల తరపున మూడు నెలల పాటు పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే చెల్లించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా పీఎఫ్ మొత్తాన్ని చెల్లించనుంది.

రూ.15 వేల లోపు జీతం కలిగిన 90 శాతం మంది ఉద్యోగులకు, సంస్థలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఉద్యోగుల వేతనాల్లో 24 శాతం మొత్తాన్ని మూడు నెలల పాటు కేంద్రం ఈపీఎఫ్‌కు జమచేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి 75 శాతం లేదా మూడు నెలల జీతం ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది.