25 శాతం కాలేయంతోనే బతుకుతున్నా.. అమితాబ్ - MicTv.in - Telugu News
mictv telugu

25 శాతం కాలేయంతోనే బతుకుతున్నా.. అమితాబ్

August 20, 2019

Amitabh Bachchan.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం గురించి షాకింగ్ వార్త చెప్పారు. తాను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నానని వెల్లడించారు. ఇది ఆయన అభిమానులకు షాక్‌కు గురిచేసింది. 

‘స్వస్థ్ ఇండియా’ అనే కార్యక్రమంలో అమితాబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చెడు రక్తం కారణంగా నా కాలేయం 75 శాతం మేర దెబ్బతిన్నది. నేను ప్రస్తుతం 25 శాతం కాలేయంతోనే బతుకుతున్నాను. సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. గతంలో  నేను టీబీ, హెపటైటిస్-బి వ్యాధులతో బాధపడ్డాను. ఇదేదో నేను ప్రచారం కోసం ఇలా చెప్పుకోవడంలేదు. నాలాగా మరొకరు బాధపడకూడదనే ఈ విషయం చెబుతున్నాను’ అని అమితాబ్ చెప్పారు. 

అయితే తాను కాలేయ వ్యాధితో సుమారు ఎనిమిదేళ్లు జబ్బేంటో తెలియకుండా బాధలు పడ్డానని, వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్లు వర్థిల్లాలని, ఇంకా మంచి మంచి సినిమాల్లో నటించి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నామని కోరుతున్నారు.