హ్యాప్పీ బర్త్‌డే అమిత్ జీ అంటూ సైరా నుంచి బిగ్ బీ లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాప్పీ బర్త్‌డే అమిత్ జీ అంటూ సైరా నుంచి బిగ్ బీ లుక్

October 11, 2018

చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకు సంబంధించిన మరొక కొత్త లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. నేడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ సహా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజ‌గురువు గోసాయి వెంక‌న్న‌ పాత్ర‌లో అమితాబ్ నటిస్తున్నట్టు సమాచారం. సమ్మర్లో విడుదల కానున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నయనతార కథానాయికగా చేస్తోంది.

విజ‌య్ సేతుప‌తి, సుదీప్ , జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏంటంటే యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. ర‌త్న‌వేలు సినీమటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.