బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి.. నోయల్ లొల్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి.. నోయల్ లొల్లి..

September 18, 2020

Big Boss has to apologize to me .. Noel

బిగ్‌బాస్ సీజన్ 4లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అయిన గంగవ్వ తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో బిగ్‌బాస్ అభిమానులు ఆమె ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇదిలావుండగా ఇంటి సభ్యులు తెలుగు మాట్లాడటంలేదని బిగ్‌బాస్ అంద‌రికీ క‌లిపి ప‌నిష్మెంట్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నోయ‌ల్ కాస్త  నొచ్చుకున్నట్టు కనిపిస్తున్నాడు. మిగతా ఇంటి స‌భ్యుల‌ను కసురుకుంటూనే  బిగ్‌బాస్ మీద కూడా చిర్రుబుర్రులాడుతున్నాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేసింది. ‘బిగ్‌బాస్ న‌న్ను క్ష‌మించండి. ఇకనుంచి తెలుగులోనే మాట్లాడ‌తాం’ అని బోర్డు మీద రాస్తున్ననోయల్.. బిగ్‌బాస్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్నాడు. దీంతో అందరూ షాక్ అయి చూస్తున్నారు. 

అంతేకాకుండా ఈ శ‌నివారం ఇంట్లోంచి వెళ్లిపోతానని నిర్ణ‌యించుకున్నానని అన్నాడు. ఎలాగైనా నాగార్జునను ఒప్పించి వెళ్లిపోతానని మొండిగా చెప్పాడు. కాగా, అభిజిత్, మోనాల్‌ గజ్జర్, అఖిల్‌లు ఇంట్లో ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. మోనాల్ హిందీలో కూడా మాట్లాడుతోంది. ఆ ముగ్గురిని కాకుండా నోయ‌ల్‌కు ఎందుకు శిక్షిస్తున్నారని నోయల్ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. మరి బిగ్‌బాస్ నోయల్‌కు క్షమాపణ చెప్పాడా అన్నది ఇవాల్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.