తమిళ బిగ్ బాస్ పై పరువు నష్టం దావా... - MicTv.in - Telugu News
mictv telugu

తమిళ బిగ్ బాస్ పై పరువు నష్టం దావా…

July 31, 2017

తమిళ్ బిగ్ బాస్ షోకు, హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హసన్. పార్టిసిపెంట్ గాయత్రి రఘురామ్ పై కొందరు పుతియ తమిళగమ్ సభ్యులు వంద కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ . మరో పార్టిసిపెంట్ అయిన చెరి(మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టింది. అలా తిట్టిడాన్ని పుతియ తమిళగమ్ అనే సంఘం సభ్యులు తప్పుబట్టారు.

సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్లు ఆరోపించారు.గాయంత్రి రఘురామన్ వ్యాఖ్యల పై కమల్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు . దీంతో కమల్ కు కూడా నోటీసులు పంపినట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు.ఓప్రెస్ మీట్ లో ఈ ఘటన పై కమల్ ను ప్రశ్నించగా . కమల్ సరిగా స్పందించలేదని . వారం రోజుల్లో నోటీసులు అందుకున్న వ్యక్తులు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే వంద కోట్లు పరువు నష్టం కింద ఇవ్వాలని ఆ సంఘం నేత డాక్టర్ క్రిష్టప్వామి డిమాండ్ చేశారు.