బిగ్ బాస్ షోలో ఇప్పటికే జ్యోతి ఎలిమినేట్ అయ్యిన విషయం తెల్సిందే,అయితే నిన్న రాత్రి సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయాడు,నేను పల్లెటూరు వాతావరణంలో ప్రశాంతంగా బ్రతికాను…ఈ నాలుగు గోడల మధ్య అద్దాలలో బ్రతకడం నావల్ల కావడంలేదు ప్లీజ్ నన్ను పంపించేయండి,అని చాలా సార్లు బిగ్ బాసుకు మొర పెట్టుకున్నాడు సంపూ,అయినా బిగ్ బాస్ అంతకు ముందు ఏమీ స్పందించలేదు.
అయితే నిన్న రాత్రి మాత్రం సంపూ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు,బిగ్ బాస్ పై తన బాధను కోపాన్ని ఒకేసారి చూపించారు,ఆ తర్వాత సంపూని రూంలోకి పిలిచి…తన సమస్యేంటో చెప్పమన్నారు,ప్లీజ్ నన్ను ఇప్పుడు పంపించినా వెళ్లిపోతాను, దయచేసి నన్ను క్షమించండి అని బిగ్ బాస్ కు తెలియజేశాడు,బిగ్ బాస్ ఇంట్లోకి మిమ్మల్ని రమ్మని ఎవ్వరూ బలవంత పెట్టలేదు,రూల్స్ అన్ని తెలిసే వచ్చారు,అయినా మీరు వెళ్లిపోవాలనుకంటే ఆర్ధికంగా మరియు లీగల్ గా కొన్ని పరిస్ధితులు ఎదుర్కోవల్సి వస్తుంది అని బిగ్ బాస్ చెప్పగానే…ప్లీజ్ నన్ను పంపించండి నేను ఉండను అనగానే బిగ్ బాస్ వెంటనే అక్కడున్న డోర్ నుంచి సంపూని బయిటికి పంపించారు. మొత్తం మీద బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూ …ఆర్టిఫిషియల్ లైఫ్ లో బ్రతకలేక బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడు.నిజంగా మనకు అలవాటైనా వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుషులు మధ్యనుండి ఒక్కసారిగా దూరమైతే మానసికంగా నిజంగా చాలా అప్ సెట్ అవుతాం,అలాంటి పరిస్ధితే సంపూ ఎదుర్కున్నాడు,మరి చూడాలే మిగతా కంటస్టెంట్స్ రాబోయే రోజుల్లొ మానసికంగా దృడంగా ఉంటారా లేకపోతే సంపూలా ఉద్వేగానికి లోనవుతారా అనేది.