బిగ్ బాస్ షోలో వీళ్లే పాత్రధారులు....! - MicTv.in - Telugu News
mictv telugu

 బిగ్ బాస్ షోలో వీళ్లే పాత్రధారులు….!

July 17, 2017

మాటీవీలో స్టార్ట్ అయిన  బిగ్ బాస్ షోలో పార్టిస్ పేట్ చేసే వాళ్ల గురించి అందరికి తెలియకపోవచ్చు,అందుకే  ఆ 14 మంది గురించి  కొంచెం డీటేల్డ్ గా మీకోసం.

1)అర్చన

హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి తెలిసిన వ్యక్తే..నువ్వస్తానంటే నేనద్దంటానాలో త్రిష  ఫ్రెండ్ గా అందరిని మెప్పించింది.మొదటి సినిమా “నేను” తో హీరోయిన్ గా పరిచయం అయినా నువ్వస్తానంటే నేనద్దాంటాతోనే నటిగా మంచి పేరచ్చిందని చెప్పుకోవచ్చు,కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ చేస్తున్నా..హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.

2)సమీర్

తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్కున్నాడు సమీర్, అంతకు ముందు పలు సీరియల్స్ తో కూడా అందర్ని మెప్పించాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో ఒకానొక పార్టిస్ పెంట్ గా చేస్తున్నాడు.

3) ముమైత్ ఖాన్

ఇప్పుడంటే  పేరున్న హీరోయిన్లు కూడా ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారు కానీ..ఐదారేండ్లకు ముందు  ఐటెమ్ సాంగ్స్  అంటే టక్కున గుర్తచ్చే పేరు ముమైత్ ఖాన్ …పోకిరిలో ఇప్పటికింకా నావయసు నిండా పదాహారే అంటూ అందర్ని తన డ్యాన్స్ తో కట్టి పడేసింది,లేడి ఓరియెంటెడ్  సినిమాలు కూడా చేసింది,మొన్న  బయటపడ్డ డ్రగ్స్ వివాదంలో ఈమె పేరు కూడా వినిపించింది,

4)ప్రిన్స్

బస్టాప్,రొమాన్స్ ,నీకు నాకు డ్యాష్ డ్యాష్ వంటి  చిత్రాల్లో హీరోగా చేసిన ప్రిన్స్…బిగ్ బాస్ షో ద్వారా తను తెర వెనక ఎలా ఉంటాడో అందరికి చూపించబోతున్నాడు.

5)మధుప్రియ

ఆడపిల్లనమ్మా  అనే పాటతో అందరి మనసులు గెల్చుకుంది మధుప్రియ,అనేక జానపదాలను తన గొంతులో పల్కించి చాలా స్టేజీల మీద  తన గానాన్ని వినిపించింది,తాజాగా శేఖర్ కమ్ముల  సినిమాలో ఓ పాట కూడా పాడింది.

6)సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం సినిమాతో  బర్నింగ్ స్టార్ గా  అందరికి పరిచయమ్యాడు,వైరస్ ,కొబ్బరి మట్ట అంటూ ఇలా డిఫరెంట్ పేర్లతో సినిమాలు తీస్తూ తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు,సిద్దిపేట దగ్గర ఓ మారుమూల గ్రామంలో పుట్టి..హీరో కావడానికి అందం హైటుతో సంబంధంలేదు..ఆసక్తి ఉంటే చాలు..అని ఎందరికో ఇన్ప్సైర్ అయ్యాడు.

7)జ్యోతి

సినిమాల్లో కొంచెం గ్లామరస్ పాత్రల్లో  కనిపించే జ్యోతి..పెళ్ళాం ఊరెళితే  సినిమాతో అందర్ని  మెప్పించింది,నేను సినిమాల్లో గ్లామరస్ పాత్రలు చేశానని  బైట కూడా నన్ను అందరూ అలాగే చూస్తారు…కానీ బైట కనిపించే జ్యోతి వేరని…అదేంటో అందర్కి తెలియ జెయ్యాలనే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నానని…బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు చెప్పింది జ్యోతి.

8)కల్పన

తన వాయిస్ తో మ్యాజిక్ చెయగల సత్తా ఉన్న సింగర్  కల్పన, తెలుగు హిందీ అనే కాకుండా ఇంకా వేరే భాషల్లో కూడా చాలా పాటలు పాడారు.కొన్ని మ్యూజిక్ ప్రోగ్రాంస్ కి  జడ్జిగా కూడా చేసారు.అందరితో కలుపుగోలుగా ఉంటూ  మంచి ఎనర్జీతో ఎంత కష్టమైన పాటనైనా తన గొంతులో పలికించగల సత్తా ఉన్న సింగర్ కల్పన అని చెప్పొచ్చు.

9)మహేశ్ కత్తి

కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మహేశ్ కత్తి  తన కలంకు పని పెడతారు..ఆ సినిమాలో ఉన్న ప్లస్ లేంటియ్ ,మైనస్ లేంటియ్  దర్శకుడు ఎలా తీసారు..యాక్టర్లు ఎలా చేసారు..ఇలా అన్ని విషయాలను తన రివ్యూ ద్వారా చెప్తుంటారు,ఒక్కోసారి ఈరివ్యూలు  విమర్శలకు కూడా దారి తీస్తుంటాయి.అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటారు.

10)కత్తి కార్తీక

తనదైన తెలంగాణ యాసతో ప్రముఖులను ఇంటర్వూ చేసి కార్తీక గా ఉన్న ఆమె.. కత్తి కార్తీకాగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది,ఆమె తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే  మన దగ్గరోళ్లతోని మాట్లాడిన ఫీలింగ్ మనకు కల్గుతుంది,అందుకే జూనియర్ ఎన్టీ ఆర్ కూడా.. ఎట్లున్రు అన్న అనంగనే..అరే నేను మస్తున్న అమ్మ…మీరు మస్తు మాట్లాడుతున్రు అని కితాబు నిచ్చారు.

11)శివ బాలాజీ

హీరోగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివ బాలాజీ  అందరికి తెలిసిన వాడే,ఆర్య ,సంక్రాతి,చందమామ సినిమాల్లో తన నటనతో మంచి ఆర్టిస్ట్ గా  గుర్తింపు తెచ్చుకుండు,చెన్నైలో పుట్టినా  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైండు.

12)హరితేజ

ఓవైపు సీరియల్స్ లో  నటిస్తూనే  అటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది,తివిక్రమ్  అ ఆ సినిమాలో సమంత ఇంట్లో పనిమనిషిగా ఉంటూ తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ  అందర్ని మెప్పించింది.

13)ఆదర్శ్

చాలా సినిమాల్లో విలన్ రోల్స్ వేశాడు,హ్యాపిడేస్ సినిమాలో గింతంత లేవ్  నా ఫిగర్ కే లైన్ వేస్తావ్ రా అనే డైలాగ్ తో అందరికి బాగా కనెక్ట్ అయ్యాడు.

14)ధన్ రాజ్

కమేడియన్ గా  కెరియర్ని మొదలు పెట్టి ..ఇప్పుడు ఓ వైపు కామెడీ చేస్తూనే  హీరోగా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు,జబర్ధస్త్ ప్రోగ్రాంతో అందరికి దగ్గరయ్యాడు,భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలో పరోటాలు తినే సీన్  ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.

ఇలా తమ తమ రంగాల్లో  తమ టాలెంటును చూపించి అందరిని మెప్పించిన వీళ్లు..బయిటి ప్రపంచంతో సంబంధంలేకుండా ఒకే ఇంట్లో ఉంటూ.. స్వయాన వండుకొని తింటూ..70 రోజులు ఉంటారు.మరి చూడాలే ఈ రియాలిటీ షోలో  వీళ్లు ఏం చేస్తారు..తోటివారితో ఎలా ఉండబోతున్నారు,ఎవరు గెలుస్తారనేది.