బిగ్ బాస్ షో లో కొత్త కుట్ర - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ షో లో కొత్త కుట్ర

August 16, 2017

తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త భాషను, కొత్త సంస్కృతిని బిగ్ బాస్ షో బలపం పట్టి నేర్పిస్తున్నట్టుగానే వుంది. పరిచయం లేని కల్చర్ ని తెలుగువాళ్ళ మీద బలంగా రుద్దే కుట్ర బిగ్ బాస్ లో జరుగుతున్నట్టే వుంది. ఈ ఫైవ్ స్టార్ హోటల్ కల్చర్లు, ప్రివిలీజియస్ గెస్ట్ లు అనేది మనకు అక్ఖర్లేని ఆచారం. అదంతా తెలుగు వాళ్ళ మీద పుయ్యాలనే మాస్టర్ ప్లానింగేమైనా వేసిందా బిగ్ బాస్ ? అందుకే ఆ కుట్రలో భాగంగానే ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసారా ?

ఆ రోజు షో ఆద్యాంతం అశ్లీలతను చోటు చేస్కొని సాగిందనే చెప్పుకోవాలి. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే ‘ హోటల్ మేనేజ్ మెంట్ ’ అనే టాస్క్. ఈ టాస్క్ లో నవదీప్, దీక్షలు హోటల్ కు వచ్చే అతిథులు. ఇక మిగతావాళ్ళలో కత్తి కార్తీక, హరితేజలు హోటల్ చెఫ్ లుగా, శివబాలాజీ హోటల్ మేనేజరుగా, ప్రిన్స్ హోటల్ అడ్మినిస్ట్రేటర్ గా, ఇక మిగతావారైన ముమైత్ ఖాన్, అర్చన, ఆదర్శ్, ధన్ రాజ్ నలుగురు వేయిటర్స్ గా నియమించబడ్డారు. అయితే బిగ్ బాస్ ఆదేశాల అనుసారం నవదీప్, దీక్షలు ముందుకు ముందే హోటల్ యాజమాన్యంతో ఎలా పని చేయించుకోవాలని చర్చించుకున్నారు.

దీక్ష ఎంట్రీ అయినప్పటి నుండీ తనకు అర్చనకు, ముమైత్ ఖాన్ కు అస్సలు పడట్లేదు. వాళ్ళనెలాగైనా ఈ టాస్క్ లో బాగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇంక ఓవరాక్షన్ స్టార్ట్ చేసారు. వాళ్ళ ఓవరాక్షన్ అశ్లీలతకు దారి తీసిందనే విషయాన్ని కూడా మర్చిపోయారు. నవదీప్ మరీ శృతి మించి అర్చనతో ఆయిల్ తో పిక్కలు మసాజ్ చేయించుకొని తర్వాత నేను షార్ట్ వేస్కుంటాను నాకు థై మసాజ్ కూడా చెయ్యాలన్నాడు. అంతటితో ఆగకుండా అర్చనతో కాలి గోర్లు తీయించుకోవడం వరకు ఓకే కానీ, అర్చన తన నోటితో అతని పిక్కల మీద వెంట్రుకలను తొలగించాలన్నాడు. అందుకు అర్చన ససేమిరా అంది.

రూంలోకెళ్ళాక మేల్ వెయిటర్స్ అండర్ వాయర్ మీద సర్వ్ చెయ్యాలని ఆజ్ఞాపించాడు. ఆఖరికి ధన్ రాజ్ త్రీ బై ఫోర్ లో షార్ట్ లోకి మారిపోయాడు. చెవుల్ని నాలుకతో క్లీన్ చెయ్యాలని పిచ్చి పిచ్చి ఆర్డర్లు వేసాడు. ఇక దీక్ష నేనేం తక్కువ తినలేదన్నట్టు ముమైత్ ను సిగరెట్ తాగడానిక్కూడా వదలకుండా తనతో హెయర్ స్టైలింగ్ చేయించుకుంది. శివ బాలాజీ, ధన్ రాజ్ లతో పింక్ కలర్ టవల్స్ కట్టించి అర్థ నగ్నంగా వాళ్ళతో ఆయిల్ మసాజ్ కూడా చేయించుకుంది. ఇదంతా చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అన్పించింది. ఎంత టాస్క్ లో గెలవాలనుంటే మాత్రం ఇలా బరితెగింపుగా అశ్లీలంగా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ?

క్లీన్ గా టాస్క్ గెలవటం చాత కాదా వాళ్ళకు ? అర్చన, ముమైత్ ఖాన్ లైతే మంటెక్కిపోయారు. వాళ్ళ ప్లేసులో ఏ కంటెస్టెంట్ వున్నా అగ్గి మీద గుగ్గిలం అవాల్సిందే. లక్కీగా కత్తి కార్తీక, హరితేజలు కిచెన్ లోనే వుండిపోయారు. కొసమెరుపు ఏంటంటే కత్తి కార్తీక వచ్చిన అతిథులకు ‘ తెలంగాణ చికెన్ ’ రుచి చూపించడం చాలా బాగా అనిపించింది. చివర్లో ఎన్ టీఆర్ వచ్చి అందరితో జాతీయ గీతం పాడించడం బాగుంగి. ఏది ఏమైనా బిగ్ బాస్ షో ఇలాగే కంటిన్యూ అయిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కరువౌతారేమో !?