బిగ్ బాస్ లో నాభర్తను అలా చూసి షాకయ్యా..! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ లో నాభర్తను అలా చూసి షాకయ్యా..!

July 19, 2017

14  కంటెస్టెంట్స్ తో మా టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా  బిగ్ బాస్ షో ప్రారంభమైన విషయం తెలిసిందే,అయితే బిగ్ బాస్ హౌస్ లో శివబాలాజీని చూసి అతని భార్య మధుమిత ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది,అదేంటంటే తోటి కంటెస్టెంట్ లు తమ లైఫ్ గురించి చెబుతుంటే అందరితో పాటు శివబాలాజీ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు,

అది చూసిన మధుమిత..నాభర్త కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తట్టుకోలేక పోయాను..ఇంతకు ముందెప్పుడు ఆయనను అలా చూడలేదు,నా భర్త చాలా దైర్యవంతుడు..కానీ అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నాకే ఆశ్చర్యమేసిందని ఫేస్ బుక్ లో రాసింది, ఒక్కరోజులోనే  తన భర్తలో ఉన్న అసాధారణమైన కోణాన్ని  బిగ్ బాస్ బయట పెట్టిందని  ఆమె చెప్పింది,అంతేకాదు ఈరోజు తన భర్త  ఏ విషయాన్ని  తోటి పార్టిస్ పెంట్స్ తో షేర్ చేసుకుంటాడో చూడాలని ఆసక్తిగా ఉందని తెలిపింది.