బిగ్ బాస్ హౌజ్ లో ఏదో జరుగుతోంది...... - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ హౌజ్ లో ఏదో జరుగుతోంది……

August 2, 2017

తెలుగు బిగ్ బాస్ షో మెల్లిమెల్లిగా హిట్ టాక్ తెచ్చుకున్నది. ఇప్పుడు  రేటింగ్ లో దూసుకు పోతున్నది.  ప్రారంభంలో  దీనికి తారక్ సూట్ అవుతాడా అనే  సందేహాలు వచ్చాయి. మెల్లి మెల్లిగా అవి కూడా పోతున్నాయి.  కాన్వర్జేషన్లో ఆయనా బాగా ఇంప్రూవ్ అయ్యారు. సందర్భానుసారంగా నవ్వుతున్నారు. మాటలు కలుపుతున్నారు. ఆయన తగ్గి పాత్రలకు ప్రయార్టీ ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వారు మాత్రం కొత్త  లోకాన్ని చూస్తున్నారని పెద్ద ఎత్తున డిబేట్ అవుతున్నది.

బిగ్ బాస్ హౌజ్ లో ఏదో జరుగతుందనే ప్రచారం కూడా జోరందుకున్నది. తొలి వారంలో  అంతా బాగానే ఉంది.  వారం దాటిన తర్వాత అస్సలు సిన్మా స్టార్ట్ అయింది. అందులో ఉండలేనని సంపూ తెగేసి చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఇమడ లేకనో మరే కారణాలో కాని మధుప్రియ పైనా  హౌజ్ లో ఉన్న వారే చాలా రకాల కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చింది. జ్యోతి ఆమె కంటే ముందే బయటకు వెళ్లింది.  అందులో ఉన్న  తమ సొంత భావాలను బయటకు చెప్ప లేక… నటనను కొనసాగించనూ లేక సతమతం అవుతున్నారట.

ప్రపంచంతో సంబంధం లేకుండా మనుష్యులు ఎంత కాలం ఉండగలరు. అదీ కొద్ది మంది మధ్యనే రోజూ చూస్తున్న వాళ్లనే చూస్తూ ఉండగలరు. ఉన్న వారి సంబంధాలు ఎట్లా ఉంటాయి. వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయనే విషయం వారికి అర్థం అవుతున్నది. వాస్తవనికి ప్రోగ్రామ్ కాన్సె ప్ట్ కూడా ఇదే. చాలా సందర్భాల్లో తమ ప్రస్టేషన్ బయటకు వస్తూనే ఉంది. తమ బాధనూ చెప్పుకుంటున్నారు.

నిన్న ధన్ రాజ్ బోరున విలపించాడు. తన ఇంట్లో కూడా   చేయనన్ని పనులు ఇక్కడ చేశానని చెప్పుకున్నాడు.  కొందరి స్టోరీలు విని శివబాలాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇట్లా అందులో ఉన్న వారు ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త అనుభవాన్ని చూస్తున్నారు. బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ తాము  కొత్త విషయం నేర్చుకున్నామని చెప్తున్నారు. జీవితంలో ఇది మర్చిపోలేనిదని అంటున్నారు.  ఇంకా ఈ షో కొన్ని రోజుల పాటు సాగాల్సి ఉంటుంది. ముందు ముందు ఎలాంటి అనుభవాలు… పాఠాలు హౌజ్ లో ఉన్న వారు నేర్చుకుంటారో చూడాలి. అయితే….వారు చెప్తున్న మాటలు నిజమే అయితే ఈ షో నిజంగా హిట్ అయినట్లే… దాని పరస్పస్ నెరవేరినట్లే మరి.