“బిగ్ బాస్” షో..తెలుగులో స్టార్ మాలో ఆదివారం రాత్రి స్టార్ట్ అయ్యింది,జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా.. 14 మంది పార్టిస్ పెంట్స్..పూణేలో ప్రత్యేకంగా వేసిన హౌస్ సెట్ లోకి ఎంటర్ అయ్యారు.ప్రతిరోజు 9.30 రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది..శని ఆదివారాలు మాత్రం రాత్రి 9.00 గంటలకు ఆవారంలో పార్టిసిపెంట్స్ మద్య జరిగిన సంఘటలను గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీ ఆర్ యాంకర్ గా అందరిని అలరిస్తాడట.
అసలు ఈ బిగ్ బాస్ షో అంటే ఏంటి…ఎక్కడ పుట్టింది..?
సాధారణంగా ప్రతీ మనిషికి ఇంకోమనిషి జీవితంలోకి తొంగి చూడాలనే కుతుహలం ఎంతో కొంత ఉంటుంది.ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్లు ఏం చేస్తారు…వాళ్ల లైఫ్ స్టైల్ కి మన లైఫ్ స్టైల్ కి ఉన్న తేడా ఏంటి అని గమనించడంలో ఆసక్తి ఉంటుంది.అలాపుట్టిందే ఈరియాలిటీ షో.కొంతమందిని ఒకే ఇంట్లో వదిలేసి ప్రపంచంతో సంబంధంలేకుండా..కొన్నిరోజులు ఉంచి..ది బెస్ట్ అనుకున్నవారికి ప్రైజ్ మనీ ఇస్తారు.మొట్ట మొదటిగా 1999లో నెదర్లాండ్ దేశంలో ఓ టీవీలో బిగ్ బ్రదర్ గా స్టార్టయ్యింది.ఆతర్వాత మెల్లి మెల్లిగా మనదేశంలో బిగ్ బాస్ గా మారింది,హిందీలో 10 సీజన్స్ కంప్లీట్ చేస్కుంది.ఇదే పేరుతో కన్నడలో సుదీప్ హోస్ట్ గా చేస్తున్నారు,తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు,ఇప్పుడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు.
తెలుగు బిగ్ బాస్ లో పార్టీస్ పెంట్స్ వీరే..!
1)అర్చన 2)సమీర్ 3)ముమైత్ ఖాన్ 4)ప్రిన్స్ 5)మధుప్రియ 6)సంపూర్ణేశ్ బాబు 7)జ్యోతి 8)కల్పన 9)మహేశ్ కత్తి 10)కత్తి కార్తీక 11)శివ బాలాజీ 12)హరితేజ 13)ఆదర్శ్ 14)ధన్ రాజ్..
పార్టిస్ పెంట్స్ ఎంపికలో కూడా డిఫరెంటే….
మహేశ్ కత్తి..బహుశా అందర్కి ఈ పేరు పరిచయం లేక పోవచ్చు..కానీ సినీ ప్రియులకు ఈయన సుపరిచితుడే,కొత్తగా విడుదలైన సినిమాలకు తనదైన స్టైల్ లో రివ్యూలు రాసే మహేశ్ కత్తి గారిని..బిగ్ బాస్ లోకి తీస్కున్నారు,తెలంగాణా యాసలో తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేసి అందర్ని మెప్పించిన కత్తి కార్తీకను గుడ తీస్కున్నరు,హృదయ కాలేయంతో హీరో అయిన సంపూర్ణేశ్ బాబు,సింగర్ మధు ప్రియ ఇలా ఎవ్వరూ ఊహించని వారిని బిగ్ బాస్ లోకి తీసుకోవడం విశేషం.తెలంగాణా వాళ్లకు బాగానే ప్రిఫరెన్స్ ఇచ్చారని తెలుస్తుంది.
బిగ్ బాస్ షో రూల్స్….!
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన వాళ్లు అందరూ కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి,ఎవరెవరు ఏం చెయ్యాలో బిగ్ బాస్ తన వాయిస్ ఎప్పటికప్పుడు చెప్తునే వుంటారు,ఎవరు వంట చెయ్యాలి,ఎవరు ఏం ఏం పనులు చెయ్యాలనీ,బాత్రూంలో తప్ప 24 గంటలు కెమెరా కళ్లు వాళ్లని గమనిస్తూనే ఉంటాయి,70 రోజులు చేతిలో మొబైల్ ఉండదు,చూడడానికి టీవి ఉండదు తోటి పార్టిస్ పెంట్స్ ని తప్ప..మరో వ్యక్తులను కలిసే అవకాశముండదు.మొత్తం మీద బైటి ప్రపంచానికి వీళ్లకు సంభందమే ఉండదు,ఎవరి పనులు వాళ్లే చేస్కోవాలి.
ఎన్టీఆర్ యాంకర్ గా…!
బిస్ బాస్ షోకి జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ చెయ్యడం…ఆ షోకి మంచి ఎనర్టీ వచ్చిందనే చెప్పాలి,తన మాటలతో తన ఎనర్జీతో వెండితెర మీదనే కాదు బుల్లితెరమీద కూడా అందర్ని మెస్మరైజ్ చేశాడు. పార్టిస్ పెంట్స్ తో మాట్లాడే విధానం,తన సరదా సంభాషణతో అందర్ని ఆకట్టుకున్నాడు.
ఛాలెంజ్ గా తీస్కొని…!
మన ఇల్లు గాదు ,మన కుటుంబ సభ్యులుగాదు,24 గంటలు కెమెరా కన్ను మనమీద ఉంటుంది.మనం ఏం చేసినా…ఎలా బిహేవ్ చేసినా అది కోట్ల మంది కళ్లలో పడుతుంది, నిజంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఛాలెంజింగ్ గా తీస్కొని ఇందులో పార్టిస్ పేట్ చేస్తున్న ప్రతి ఒక్కర్ని మనం అభినందించాల్సిందే..చూడాలె మరి రాబోయే ఈ డెబ్బై రోజులలో ఎవరు పబ్లిక్ మనసు గెల్చుకుంటారో…స్టార్ మా వాళ్లిచ్చే ప్రైజ్ మనీ గెల్చుకుంటారో. ఆల్ ది బెస్ట్ టు ఆల్ పార్టిస్ పెంట్స్.