బ్రేకింగ్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

April 25, 2022

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాసేపటి క్రితమే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విడుదల చేసిన ఉద్యోగాలలో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఇందులో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.

మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడెప్పుడు ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ అందరూ ఊహించినట్లుగానే మొదటగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకే నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. మే నెల 2 నుంచి 20 వ‌ర‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకునే అవ‌కాశం కల్పించింది. ఇందుకోసం అభ్య‌ర్థులు www.tslprb.inను సంప్ర‌దించ‌వ‌చ్చని తెలిపింది.

ఆయా విభాగాల్లో ఖాళీల వివ‌రాలు..

1. ఎస్సై పోస్టులు 414
2. సివిల్ కానిస్టేబుల్ 4,965
3. టీఎస్‌పీఎస్సీ బెటాలియ‌న్ కానిస్టేబుల్ 5,010
4. ఏఆర్ కానిస్టేబుల్స్ 4,423
5. స్పెష‌ల్ పోలీస్ 390
6. ఫైర్ విభాగంలో 610
7. డ్రైవ‌ర్లు 100గా ఉన్నాయి.