కుప్పకూలిన భారీ గణేష్ విగ్రహ మండపం..
Editor | 18 Aug 2019 7:42 AM GMT
విశాఖ నగరంలో భారీ గణనాథుడి విగ్రహం తయారీలో అపశ్రుతి చోటు చేసుకుంది.వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖ నగరంలోని నాతయ్యపాలెంలో పవర్ యూత్ సంఘం సభ్యులు 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పనులు కూడా చకచకా చేస్తున్నారు. ఈ క్రమంలో వర్షం, గాలులు ముసురుకున్నాయి. దీంతో నిర్మించిన భారీ మండపం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. మండపం కూలిపోవడంతో సుమారు రూ.15లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు చెప్పారు.
Updated : 18 Aug 2019 7:42 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire